Janhvi Kapoor : తెలుగు తెరపై పరిచయం అయ్యేందుకు జాన్వీ కపూర్ ఎంతగానో శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఆమె తనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టడం లేదు. అయితే తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించే చాన్స్‌ను సైతం ఆమె తాజాగా మిస్ చేసుకుంటుందని సమాచారం. అందులో భాగంగానే ఆమె టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె. ఆమె తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్లో ప్రముఖ నిర్మాత. ఆయన తలచుకోవాలనే గానీ.. జాన్వీకి లెక్కలేనన్ని ఆఫర్లు వస్తాయి. కానీ జాన్వీ మాత్రం ఇప్పటికే అనేక ఆఫర్లను వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు టాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్లను ఆమె వదులుకుంటుందని సమాచారం.
విజయ్ దేవరకొండ హీరోగా.. అనన్య పాండే హీరోయిన్గా తెరకెక్కుతున్న లైగర్ మూవీలో ముందుగా అనన్యకు బదులుగా జాన్వీకే అవకాశం ఇచ్చారట. కానీ ఆమె అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రామ్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రానున్న ఓ మూవీలోనూ జాన్వీకి ముందుగా ఆఫర్ ఇచ్చారట. కానీ ఆమె అందుకు నో చెప్పిందట. దీంతో ఆమెకు బదులుగా ఆ మూవీలో పరిణీతి చోప్రాను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాన్వీ తనకు వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తోంది. అయితే ఆమె గనక ఏదో ఒక ఆఫర్‌ను ఓకే చేస్తే బాగుంటుందని.. టాలీవుడ్ లో పలువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి జాన్వీ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.