Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాయ్ ఆదేశాల మేరకు 30 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల వాలిడిటీతో అందిస్తున్న ప్లాన్‌కే మార్పులు చేసి ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను పొందాలంటే వినియోగదారులు రూ.259ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 30 రోజుల వరకు వస్తుంది. దీన్నే క్యాలెండర్ మంత్ వాలిడిటీ ప్లాన్‌గా జియో ప్రవేశ పెట్టింది.
రూ.239 ప్లాన్ ఇది వరకే ఉండగా దానికి మార్పులు చేసి రూ.259 ప్లాన్‌ను జియో అందుబాటులోకి తెచ్చింది. అయితే రూ.239 ప్లాన్ ను కూడా అలాగే ఉంచింది. ఇందులో 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. రూ.259 ప్లాన్‌లో 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇక రెండింటిలోనూ అందించే బెనిఫిట్స్ ఒకేలా ఉన్నాయి. రోజుకు 1.50 జీబీ డేటా వస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లను రోజూ వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. జియో యాప్స్‌ను కూడా ఉచింగానే వాడుకోవచ్చు.
ఇక రూ.199 ప్లాన్‌కు 23 రోజుల వాలిడిటీని అందిస్తున్నారు. రూ.119 ప్లాన్‌కు 14 రోజుల వాలిడిటీ ఉంటుంది. వీటిలోనూ పైన తెలిపిన బెనిఫిట్స్‌నే అందిస్తున్నారు. అయితే రూ.259 ప్లాన్ క్యాలెండర్ మంత్ వాలిడిటీ ప్లాన్ కనుక ఈ ప్లాన్ ను ఈ నెల ఏ తేదీన అయితే రీచార్జి చేసుకుంటారో తిరిగి వచ్చే నెల కూడా అదే తేదీ వరకు ఈ ప్లాన్ వస్తుందన్నమాట. అంటే ఉదాహరణకు.. రూ.259 ప్లాన్‌ను ఈ నెల 5వ తేదీన రీచార్జి చేశారనుకుంటే.. వచ్చే నెల కూడా 5వ తేదీనే మళ్లీ ఈ ప్లాన్‌ను రీచార్జి చేయాల్సి ఉంటుంది. ట్రాయ్ ఆదేశాల మేరకు 30 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు జియో వెల్లడించింది.