Kobbari Garelu : గారెలు అంటే అందరికీ ఇష్టమే. వీటిని అందరూ ఎంతో ఆసక్తిగా తింటుంటారు. ఈ క్రమంలోనే రకరకాల పదార్థాలతో గారెలను చేస్తుంటారు. మినప గారెలు, పెసర గారెలు, మొక్కజొన్న గారెలను చేసి తింటుంటారు. అయితే కొబ్బరితోనూ గారెలను చేయవచ్చు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే కొబ్బరి గారెలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – 1 కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు, పచ్చిమిర్చి – 8, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
కొబ్బరి గారెలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో బియ్యం పిండి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు, పచ్చి మిర్చి, జీలకర్ర కలిపి దంచిన ముద్దను వేసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత వేడి నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ కవర్ మీద చిన్న గారెలా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినీ కూడా గారెల్లా వేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన కొబ్బరి గారెలు రెడీ అవుతాయి. ఎప్పుడూ రొటీన్‌గా ఉండే గారెలను కాకుండా ఇలా ఒక్కసారి కొబ్బరి గారెలను వేసుకుని తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.