Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Konaseema Kodi Pulao : కోన‌సీమ కోడి పులావ్‌ను ఇలా చేశారంటే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
June 24, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Konaseema Kodi Pulao : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చికెన్ తో చేసే వంట‌కాల్లో పులావ్ కూడా ఒక‌టి. చికెన్ పులావ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులావ్ ను సుల‌భంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోన‌సీమ కోడి పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కోన‌సీమ కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – అర క‌ప్పు, దాల్చిన చెక‌క్క ముక్క‌లు – 2, మ‌రాఠీ మొగ్గ – 2, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 6, జీడిప‌ప్పు – గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్స్, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, చికెన్ – ముప్పావు కిలో, త‌రిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, కొబ్బ‌రి పాలు – ఒక క‌ప్పు, అర గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – 2 క‌ప్పులు, నీళ్లు – 3 క‌ప్పులు, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Konaseema Kodi Pulao recipe in telugu very tasty how to make it
Konaseema Kodi Pulao

బిర్యానీ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బిర్యానీ ఆకు – 1, మిరియాలు -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, అనాస పువ్వు – 1, జాప‌త్రి – 1, జాజికాయ – చిన్న ముక్క‌, ల‌వంగాలు – 8, యాల‌కులు – 8, సోంపు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – రెండు టీ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – 3 టీ స్పూన్స్.

కోన‌సీమ కోడి పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేయించాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. ఈ చికెన్ ను 10 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసుకోవాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొబ్బ‌రి పాలు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మూత తీసి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత మ‌ర‌లా మూత పెట్టి మంట‌ను చిన్న‌గా చేసి పూర్తిగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత అంతా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన చికెన్ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Konaseema Kodi Pulao
Previous Post

Bhindi Egg Fry : బెండ‌కాయ‌లు, కోడిగుడ్ల‌ను క‌లిపి ఇలా ఫ్రై చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Next Post

Water Apple For Diabetes : దీన్ని ఒక్క‌సారి తింటే చాలు.. 500 షుగ‌ర్ ఉన్నా స‌రే 90కి వ‌స్తుంది..!

Related Posts

international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.