Maa Ishtam Trailer : వామ్మో.. వ‌ర్మ అరాచ‌కం.. ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో..!

Maa Ishtam Trailer : వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను తీస్తాడ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఎంతో పేరుంది. అయితే ఆ పేరును ఆయ‌న ఎప్పుడో పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఓటీటీల యుగం ప్రారంభం అయ్యాక ఆయ‌న ఆ ప్లాట్‌ఫామ్‌ల‌ను దృష్టిలో ఉంచుకునే సినిమాల‌ను తీస్తున్నారు. ఇక తాజాగా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆయన ఇంకో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ముందుగా ఈ మూవీకి డేంజ‌ర‌స్ అని పేరు పెట్టారు. కానీ టైటిల్‌కు.. క‌థ‌కు పోలిక లేద‌ని చెప్పి టైటిల్‌ను మార్చారు. ఈ క్ర‌మంలోనే డేంజ‌ర‌స్ సినిమా పేరును మా ఇష్టంగా మార్చారు.

Maa Ishtam Trailer launched
Maa Ishtam Trailer

కాగా మా ఇష్టం సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను చూస్తుంటేనే సినిమా అంతా అరాచ‌క‌మే ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. రామ్ గోపాల్ వ‌ర్మ అద్భుత‌మైన సినిమాల‌ను తీసి చాలా రోజులే అవుతోంది. ఆయ‌న తీస్తున్న ఇప్ప‌టి సినిమాలు అన్నీ ఎంతో అస‌భ్య‌క‌రంగా ఉంటున్నాయి. ఇక మా ఇష్టం సినిమా కూడా అలాగే ఉంటుంద‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మైపోతోంది.

మా ఇష్టం సినిమాలో నైనా గంగూలీ, అప్స‌ర రాణిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా మూవీ సాగుతుంద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా స్టోరీ లైన్‌ను కూడా ఆయ‌న చెప్పేశారు. ఇద్ద‌రు ప్రేమికులైన యువ‌తుల మ‌ధ్య జ‌రిగే స్టోరీయే ఈ సినిమా అని తెలిపారు. ఈ మూవీని ఏప్రిల్ 8వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Share
Editor

Recent Posts