Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

Mahesh Babu  Sarkaru Vaari Paata penny song dance by Sitara
Mahesh Babu

కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. వంద మిలియ‌న్ వ్యూస్‌తో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలోని సెకండ్ సాంగ్‌ను ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తామ‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సెకండ్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలోని పెన్నీ సాంగ్ తో మ‌హేశ్ బాబు కూతురు సితార అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మొద‌టి సారిగా సితార మ్యూజిక్ ఆల్బ‌మ్ లో న‌టించి త‌న డ్యాన్స్‌ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ను చేసే డ్యాన్స్ వీడియోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పెన్నీ సాంగ్ ఈ సినిమాలో మ‌హేశ్ బాబు ఇన్‌ట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లా ఉంది.

ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు కుమారుడు గౌత‌మ్ 1 నేనొక్క‌డినే సినిమాతో వెండి తెరకు ప‌రిచ‌య‌మ‌య్యాడు. కాగా కూతురు సితార కూడా వెండి తెర‌కు ప‌రిచ‌యం కానున్న‌ద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి కొంద‌రు ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగానే సితార డ్యాన్స్ చేసి ఉంటుంద‌ని అభిప్రాయప‌డుతున్నారు.

Share
D

Recent Posts