Kobbari Junnu : జున్ను పాలు లేక‌పోయినా.. జున్నును ఈ విధంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Kobbari Junnu : సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌స‌వించిన‌ప్పుడు మాత్ర‌మే జున్ను పాలు వ‌స్తుంటాయి. జున్నును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సాధార‌ణంగా మ‌నం తాగే పాల క‌న్నా జున్ను పాల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, రోగ‌ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో జున్ను పాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కానీ ఆవు లేదా గేదె జున్ను పాలు మ‌న‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండ‌వు. క‌నుక ఈ పాల‌తో చేసిన జున్ను రుచి వ‌చ్చేలా.. మ‌నం కొబ్బ‌రి పాల‌తోనూ జున్నును త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌తో జున్నును ఏ విధంగా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

make Kobbari Junnu in this way even without junnu milk
Kobbari Junnu

కొబ్బ‌రి పాల జున్ను త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొబ్బ‌రి కాయ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), కార్న్ ఫ్లోర్‌ – 2 టేబుల్ స్పూన్స్‌, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌, నీళ్లు – ఒక గ్లాసు.

కొబ్బ‌రి పాల జున్ను త‌యారీ విధానం..

ముందుగా కొబ్బ‌రి కాయ నుండి కొబ్బ‌రిని తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని కొద్దిగా నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు ఒక జార్ లో కొబ్బ‌రి ముక్కల‌ను మెత్త‌గా ప‌ట్టుకోవాలి. ఇలా ప‌ట్టిన త‌రువాత ఒక గ్లాసు నీళ్లు, బెల్లం తురుము వేసి మ‌ళ్లీ మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ కొబ్బ‌రి మిశ్ర‌మాన్ని వ‌స్త్రం లేదా జ‌ల్లిగంట స‌హాయంతో వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన కొబ్బ‌రి పాల‌లో ఉండ‌లు లేకుండా క‌లిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్, యాల‌కుల పొడి, మిరియాల పొడి వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఇడ్లీ పాత్ర‌లో కానీ, మూత ఉండే పెద్ద పాత్ర‌లో కానీ నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడి అయ్యాక జున్ను మిశ్ర‌మాన్ని క‌లుపుకున్న గిన్నెను వేడి చేసుకున్న నీళ్ల‌లో పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న జున్నును పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి పాల జున్ను త‌యార‌వుతుంది. పిల్ల‌లు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts