Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Jalebi : షాపుల్లో అమ్మే లాంటి రుచితో.. ఇంట్లోనే జిలేబీని ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

D by D
November 5, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Jalebi : జిలేబి.. ఈ పేరు విన‌గానే చాలా మంది నోట్లో నీళ్లు ఊరుతాయి. జిలేబి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. జిలేబీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు అని చెప్ప‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు బ‌య‌ట విరివిరిగా ల‌భిస్తాయి. బ‌య‌ట కొనే ప‌నే లేకుండా అదే రుచితో వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జిలేబీని రుచిగా, స‌లుభంగా ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జిలేబి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – 100 గ్రా., పంచ‌దార – 150 గ్రా., బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, ఆరెంజ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

make street style Jalebi in this way know the recipe
Jalebi

జిలేబి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో బేకింగ్ సోడాను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 12 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. 12 గంట‌ల త‌రువాత పిండిని మ‌రోసారి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఇందులో చిటికెడు ఫుడ్ క‌ల‌ర్ ను నీటిలో క‌లిపి వేయాలి. ఈ పిండిని మ‌రోసారి బాగా క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద గిన్నెను ఉంచి అందులో పంచ‌దార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత దీనిని లేత తీగ పాకం వ‌చ్చే ఉడికించాలి.

త‌రువాత అందులో ఫుడ్ క‌ల‌ర్, పావు టీ స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత మందంగా ఉండే ప్లాస్టిక్ క‌వ‌ర్ లేదా మందంగా ఉండే కాట‌న్ వ‌స్త్రాన్ని తీసుకుని అందులో పిండిని వేసి మూట క‌ట్టాలి. త‌రువాత ఆ మూట‌కు ఒక ప‌క్క‌న చిన్న రంధ్రాన్ని చేసి జిలేబి వ‌త్తుకోవాలి. ఇలా త‌గిన‌న్ని జిలేబీలు వ‌త్తుకుని వాటిని నూనెలో కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండువైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ముందుగా త‌యారు చేసిన పంచ‌దార మిశ్ర‌మంలో వేయాలి. వీటిని పంచ‌దార మిశ్ర‌మంలో 30 సెక‌న్ల పాటు నాన‌బెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే జిలేబీలు త‌యార‌వుతాయి. జిలేబీలు వేయ‌డానికి ప్లాస్టిక్ క‌వ‌ర్ కు బ‌దులుగా సాస్ బాటిల్స్ ను, వాట‌ర్ బాటిల్ మూత‌కు రంధ్రాన్ని చేసి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. నేరుగా జిలేబీలు వేయ‌డం రాని వారు ముందుగా ప్లేట్ మీద వేయ‌డం నేర్చుకుని త‌రువాత నూనెలో వేయాలి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌నిలేకుండా ఇంట్లోనే ఇలా ఎంతో రుచిగా ఉండే జిలేబీలను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Jalebi
Previous Post

Eggs Freshness Test : కోడి.. గుడ్డు పెట్టి ఎన్ని రోజుల‌వుతుంది.. గుడ్లు తాజాగా ఉన్నాయా లేదా.. ఈ చిట్కాల‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Next Post

Jilledu : షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.