ఒత్తిడి కారణంగా చాలామంది సఫర్ అవుతున్నారు. తాజాగా 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డారు. బజాజ్ ఫైనాన్స్ లో ఆయన పని చేస్తున్నారు. ఆదివారం ఆయన ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా సతమతమయ్యి సూసైడ్ చేసుకున్నారు. భార్యని. ఇద్దరు పిల్లల్ని ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి. ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ రాస్తూ.. తరుణ్ సక్సేనా తన రికవరీ టార్గెట్స్ గురించి రాసుకోవచ్చారు. 45 రోజులు నిద్ర పోలేదని.. కుటుంబ సభ్యుల్ని క్షమించమని ఆయన రాశారు.
అమ్మ నాన్న ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. రెండవ ఫ్లోర్ కట్టించండి. నా కుటుంబ సభ్యులు అక్కడ కంఫర్ట్ గా ఉంటారని రాసారు. తరుణ్ సక్సేనా బజాజ్ ఫైనాన్స్ లో ఏరియా మేనేజర్ గా పని చేస్తున్నారు.
సీనియర్స్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా వాటిని తట్టుకోలేక ఈ ఆత్మహత్యకి పాల్పడుతున్నట్లు పోలీసులు సూసైడ్ నోట్ ద్వారా తెలిపారు. ఉదయాన్నే రీజనల్ మేనేజర్, నేషనల్ మేనేజర్ మానసికంగా టార్చర్ చేశారని.. కాన్ఫరెన్స్ సమయంలో తిట్టారని దీంతో ఫ్రస్టేషన్ కి గురై ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సంఘటన కంటే ముందు HDFC బ్యాంక్ లో పని చేసే ఒక ఉద్యోగి కూడా ఓవర్ వర్క్ కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.