Mango Jam : బ‌య‌ట షాపుల్లో ల‌భించే మ్యాంగో జామ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!

Mango Jam : పిల్ల‌లు ఇష్టంగా తినే ఆహార ప‌దార్థాల్లో జామ్ కూడా ఒక‌టి. దీనిని పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ జామ్ ల‌భిస్తూ ఉంటుంది. వాటిలో మ్యాంగో జామ్ కూడా ఒక‌టి. మామిడిపండ్ల‌తో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు దీనిని కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మ్యాంగో జామ్ ను మం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జామ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే రుచిగా మ్యాంగో జామ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో జామ్ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

మామిడిపండు – పెద్ద‌ది ఒక‌టి, పంచ‌దార – అర క‌ప్పు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు గ్లాస్.

Mango Jam recipe in telugu make in this way
Mango Jam

మ్యాంగో జామ్ త‌యారీ విధానం..

ముందుగా మామిడిపండుపై ఉండే తొక్క‌ను తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని మందంగా ఉండే క‌ళాయిలో వేసుకోవాలి. దీనిని పెద్ద మంట‌పై 5 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి పంచ‌దార వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌రో 15 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి. ఈ మామిడికాయ మిశ్ర‌మంలోని నీరంతా పోయి జామ్ లాగా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మ్యాంగో జామ్ త‌యార‌వుతుంది. దీనిని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఇలా త‌యారు చేసుకున్న జామ్ ను బ్రెడ్, చ‌పాతీ వంటి వాటితో తీసుకోవ‌చ్చు. అలాగే ఇత‌ర తీపి వంట‌కాల్లో కూడా దీనిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts