Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌తో పెళ్లి.. అస‌లు విష‌యం చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Rashmika Mandanna : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌ల గురించి త‌ర‌చూ వార్త‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వీరి పెళ్లి గురించి కొన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. నేష‌న‌ల్ మీడియాలో సైతం ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించారు. వీరు ఇరు కుటుంబాల‌ను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాదిలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఇటీవ‌ల క‌థ‌నాలు వచ్చాయి. అయితే వాటిపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు.

marriage with Rashmika Mandanna how Vijay Devarakonda reacted
Rashmika Mandanna

ర‌ష్మిక మంద‌న్న‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై విజ‌య్ స్పందించాడు. అవ‌న్నీ పుకార్లేన‌ని.. అస‌లు ఇలాంటి వార్త‌ల‌ను ఎలా సృష్టిస్తారోన‌ని.. అన్నాడు. ఈ క్ర‌మంలోనే ఆ వార్త‌లు పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని.. వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరాడు. ఈ మేర‌కు విజ‌య్ ట్వీట్ చేశాడు.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న లైగ‌ర్ అనే పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నాడు. ఇందులో విజ‌య్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. ఈ ఏడాది ఆగ‌స్టు 25న ఈ మూవీని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Editor

Recent Posts