Masala Egg Bonda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మ‌సాలా ఎగ్ బొండా.. ఇలా చేయాలి..!

Masala Egg Bonda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో మ‌సాలా ఎగ్ బోండాలు కూడా ఒక‌టి. ఎగ్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. ఇంట్లో కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఈ మ‌సాలా ఎగ్ బోండాల‌ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా ఎగ్ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, శ‌న‌గ‌పిండి – ముప్పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గరం మ‌సాలా – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, వంట‌సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Masala Egg Bonda recipe in telugu very tasty easy to make
Masala Egg Bonda

మ‌సాలా ఎగ్ బోండా త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ను నిలువుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా క‌లుపుకోవాలి. దీనిని బ‌జ్జీ పిండిలా క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బోండాల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఎగ్ బోండా త‌యార‌వుతుంది. వీటిని ట‌మాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కోడిగుడ్ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఎగ్ బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా ఇంట్లో అంద‌రూ వీటిని తినేస్తారు.

D

Recent Posts