Mayanti Langer : వేసవికాలం వస్తుందంటే చాలు.. ఓవైపు మండే ఎండలు మనకు గుర్తుకు వస్తాయి. అలాగే చల్లని వినోదాన్ని అందించే ఐపీఎల్ కూడా మనకు ఆహ్వానం పలుకుతుంటుంది. ఐపీఎల్ వస్తుందనగానే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కనుక చాలా మంది ఫోన్లలోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో ఓ వైపు ప్లేయర్లతోపాటు మరోవైపు అందాలు చిందించే యాంకర్లు కూడా ప్రేక్షకులను అలరిస్తుంటారు. గ్లామరస్ డ్రెస్‌లు ధరించి తమదైన శైలిలో క్రికెట్ గురించి చెబుతూ లేదా ప్లేయర్లతో మాట్లాడిస్తూ.. కామెంటరీలలోనూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ యాంకరింగ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. మయంతి లాంగర్.
మయంతి గతంలో చాలా కాలం పాటు ఇండియా ఆడే మ్యాచ్‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా యాంకర్‌గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పనిచేసింది. అయితే ఈమె గతంలో టీమిండియా ప్లేయర్ స్టువర్ట్ బిన్నీని వివాహం చేసుకుంది. తరువాత 2020లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో క్రికెట్ మ్యాచ్‌లకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె మళ్లీ ఐపీఎల్‌లో యాంకర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 ఎడిషన్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఐపీఎల్ జట్లన్నీ ఇప్పటికే కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈ సారి ఐపీఎల్ నుంచి మయంతి లాంగర్ అందుబాటులో ఉంటుందని.. ఆమె కొన్ని మ్యాచ్‌లకు యాంకరింగ్ చేస్తుందని తెలుస్తోంది. దీంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమెతోపాటు సంజనా గణేషన్, తాన్యా పురోహిత్, నెరోలీ మెడోస్, నశ్‌ప్రీత్ కౌర్ తదితరులు కూడా యాంకరింగ్ చేయనున్నారు.