Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Meal Maker Curry : ఫంక్ష‌న్ల‌లో వ‌డ్డించే విధంగా మీల్ మేక‌ర్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

D by D
October 25, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Meal Maker Curry : సోయాతో త‌యారు చేసే మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని త‌గిన మోతాదులో తీసుకున్న‌ప్పుడే మాత్ర‌మే మ‌నం ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ఈ క‌ర్రీ ల‌భిస్తుంది. దీనిని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ఒక కప్పు, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, జీడిప‌ప్పు – 10, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, త‌రిగిన పెద్ద ట‌మాట – 1, బిర్యానీ ఆకు – 1, ఉప్పు – త‌గినంత‌, కాశ్మీరి కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్న‌ర‌ క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, కసూరిమెంతి -ఒక టీ స్పూన్.

Meal Maker Curry recipe make like function style
Meal Maker Curry

మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ లో వేడి నీటిని పోసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని నీరంతా పోయేలా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత‌ క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత కళాయిలో మ‌రో 2 టేబుల్ స్పూన్ల బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుప‌, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసిక‌ల‌పాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా మ‌రో టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్, రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా రెస్టారెంట్ స్టైల్ మసాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Meal Maker Curry
Previous Post

ఆకుకూర‌లను ఇలా పెంచండి.. బాగా వ‌స్తాయి..!

Next Post

Pala Pulao : పాల‌పులావ్‌ను ఇలా చేయండి.. కోడికూర‌తో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!