Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Meal Maker Masala Kurma : మీల్ మేక‌ర్ మ‌సాలా కుర్మా త‌యారీ ఇలా.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
December 19, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Meal Maker Masala Kurma : మీల్ మేక‌ర్ మ‌సాలా కుర్మా.. మీల్ మేక‌ర్ ల‌తో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మీల్ మేక‌ర్ కుర్మాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మీల్ మేక‌ర్ ల‌తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా కుర్మాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మీల్ మేక‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ మ‌సాలా కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – ఒక క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, అల్లం – అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, నాన‌బెట్టిన గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, మిరియాలు – 10, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిలికిన పెరుగు – అర క‌ప్పు, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గిన‌న్ని.

Meal Maker Masala Kurma recipe very tasty with rice and chapati
Meal Maker Masala Kurma

మీల్ మేక‌ర్ మ‌సాలా కుర్మా త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను వేడి నీటిలో వేసి ప‌ది నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని చేత్తో గ‌ట్టిగా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వ‌ర‌కు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, గ‌స‌గ‌సాలు, జీడిప‌ప్పు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, మిరియాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత అదే క‌ళాయిలో మ‌రి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన మీల్ మేక‌ర్ వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ మ‌సాలా కుర్మా త‌యార‌వుతుంది. దీనిని వేటితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన మీల్ మేక‌ర్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Meal Maker Masala Kurma
Previous Post

Aloo Dum Biryani : ఫంక్ష‌న్ల‌లో చేసే ఆలూ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Next Post

How To Use Nutmeg : జాజికాయ‌ల‌ను ఇలా వాడండి చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.