Money Plant Mistakes : మనం ఇంటి అందం కోసం, ప్రాణవాయువు కోసం ఇంట్లో వివిధ రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాము. మనం ఇంట్లో సులభంగా పెంచుకోదగిన మొక్కలల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను చాలా మంది ఇంట్లో, పని చేసే ప్రదేశంలో పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క చాలా అందంగా ఉంటుంది. అలాగే కుండీలో, నేలలో ఈ మొక్క చాలా సులభంగా పెరుగుతుంది. ఎటువంటి సస్యససంరక్షణ చర్యలు చేపట్టకపోయినా కూడా ఈ మొక్క చక్కగా పెరుగుతుంది. అయితే చాలా మంది ఈ మొక్కను అదృష్ట మొక్కగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు.
అలాగే ఇతర మొక్కల వలె కాకుండా ఈ మొక్కను నాటేటప్పుడు వాస్తూ నిపుణుల సూచనలను పాటించడంతో పాటు వివిధ రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. మనీప్లాంట్ మొక్కను నాటేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ఈ మొక్క ఎలా చూసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్య దిశలో నాటకూడదు. ఈ దిశలో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తడంతో పాటు ఇంట్లో కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. కనుక ఈ మొక్కను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో నాటుకోవాలి. అలాగే ఈ మొక్క తీగల రూపంలో పెరుగుతుంది. అలాగే చాలా వేగంగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. కనుక ఈ మొక్కతీగలు నెల తాకకుండా చూసుకోవాలి. అదే విధంగా ఈ మొక్క ఎల్లప్పుడూ ఆకుపచ్చగా ఉండేలా చూసుకోవాలి.
ఈ మొక్క ఎంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనీప్లాంట్ మొక్క ఎండిపోతే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. అలాగే మొక్కలో ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఇక మనీప్లాంట్ మొక్కను వీలైనంత వరకు ఇంటి లోపల పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మనీప్లాంట్ మొక్కకు ఎక్కువగా సూర్యరశ్మి అవసరం లేదు. ఎండ ఎక్కువగా తగలడం వల్ల మొక్క ఎండిపోవడం జరుగుతుంది. అలాగే మొక్కలో ఎదుగుదల అనేది ఉండదు. కనుక ఈ మొక్కను వీలైనంత వరకు ఇంట్లోనే పెంచుకోవాలి. అలాగే వాస్తు ప్రకారం మనీప్లాంట్ మొక్కను ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు తగ్గడంతో పాటు చేసిన పుణ్యాలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునే వారు ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని వారు సూచిస్తున్నారు.