Money Plant Tips : అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టును పెంచుకున్నప్పటికి కొందరికి కలిసి రాదు. నిజానికి ధనం వస్తుందా రాదా అన్న విషయాన్ని మనీప్లాంట్ మనకు తెలియజేస్తుంది. మనం పెంచుకునే మనీప్లాంట్ రోజురోజుకు చక్కగా పెరుగుతూ చిగుర్లు వేస్తూ ఆకులు పెద్దగా అవుతూ మంచిగా ఎగబాకుతూ ఉంటే కనుక ధనం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుందని అర్థం. అలాకాకుండా మనం ఎంత నీరు పోసిన ఎరువులు వేసినా , ఎంత పోషణను ఇచ్చిన కూడా ఈ చెట్టు ఆకులు ఎండిపోవడం కానీ, పండిపోవడం కానీ జరుగుతూ ఉంటే ఎక్కడో అక్కడ సంపాదనకు గండి పడుతుందని అర్థం. మనకు రావాల్సిన డబ్బులు ఆగిపోతున్నాయని అర్థం. అలాగే ఈ చెట్టు ఆకులు బంగారు రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా కనుక మారితే మనకు డబ్బులు వస్తాయని, ధనం అనేది నిలబడుతుందని అర్థం.
ఈ మొక్క నీడలో పెరుగుతుంది. అలాగే ఎండలో పెరుగుతుంది. అలాగే ఈ మొక్క నేల మీద పెరుగుతుంది, కుండీలోనూ పెరుగుతుంది. మనీప్లాంట్ మొక్కను మన ఇంట్లో తూర్పు ఆగ్నేయంగా పెట్టుకోవడం మంచిది. తూర్పు దిక్కుగా ఆగ్నేయ మూలలో ఈ మొక్కను ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే చాలా మంది ఈ మనీప్లాంట్ ను ఇతర చెట్లకు పాకిస్తూ ఉంటారు. ఇలా పాకించడం వల్ల మనీప్లాంట్ ఆకులు పెద్ద పెద్దగా అవుతాయి. ఇలా పెంచడం వల్ల కూడా ఎటువంటి నష్టం లేదు. అలాగే ఇంట్లో పెంచుకునే మనీప్లాంట్ చక్కటి ఆకులతో, అందంగా, గుబురుగా ఉన్నప్పటికి , ఆరోగ్యంగా ఉన్నప్పటికి డబ్బులు నిలవడం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల డబ్బులు కనిపించకపోయినా స్థిరాస్తులు మాత్రం పెరుగుతాయనడానికి ఇది ఒక సూచిక. స్థిరాస్తులు కూడా డబ్బు కిందికి వస్తాయి కనుక డబ్బులు కనిపించక స్థిరాస్తులు మాత్రం కనిపిస్తాయి.
మనీ ప్లాంట్ ను పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా రాదా అని అనుమానాలేవి పెట్టుకోకుండా మనీప్లాంట్ ను ఇంట్లో తూర్పు ఆగ్నేయంగా ఉంచి పెంచుకోవాలి. ఆగ్నేయం దిశగా ఉంచుకోవడం వీలుకాని వారు ఉత్తర దిశలో కూడా దీనిని ఉంచవచ్చు. ఇలా ఉత్తర దిశలో ఉంచడం వల్ల కూడా ఎటువంటి నష్టం కలగదు. ధనం విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను, ధనాభివృద్ధిని ఈ మనీప్లాంట్ మొక్క మనకు ముందుగానే సంకేతాలను ఇస్తుంది.ఈ చెట్టు ఇచ్చే సంకేతాలను మనం జాగ్రత్తగా గమనించుకుంటూ అర్థం చేసుకోగలిగితే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఈ మనీప్లాంట్ మొక్కను పెంచుకోగలిగితే లాభమే తప్ప నష్టం మాత్రం లేదు. ఇంట్లో పెంచుకునే మనీప్లాంట్ మొక్క ఎండిపోతే ఆ స్థానంలో మరో కొత్త మొక్కను పెంచుకోవాలి తప్ప పెంచుకోవడం మానేయకూడదు.