OTT : ప్రతి వారం ఓటీటీల్లో అనేక సిరీస్‌లు, సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ క్రమంలోనే వారాంతాల్లో ఎక్కువగా వాటిని విడుదల చేస్తుంటారు. ఓటీటీలకు ప్రేక్షకులు బాగా అలవాటు పడిన నేపథ్యంలో ఆయా స్ట్రీమింగ్ యాప్‌లు కూడా ఆసక్తికరమైన సిరీస్‌లు, సినిమాలను వారం వారం విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీల్లో అందుబాటులోకి రానున్న సిరీస్‌లు, సినిమాలు ఏమిటో ఇప్పడు తెలుసుకుందాం.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ నెల 17వ తేదీన ఎ థర్స్ డే అనే మూవీ స్ట్రీమ్ కానుంది. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన 83 మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 18వ తేదీన స్ట్రీమ్ కానుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనెలు లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో స్ట్రీమ్ కానుంది. ఈ నెల 18వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో హృదయం అనే మళయాళం సినిమా స్ట్రీమ్ కానుంది. రొమాన్స్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ నెల 17వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ ప్యాక్ అనే కన్నడ సినిమా స్ట్రీమ్ కానుంది. కామెడీ, రొమాన్స్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 18వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లోనే బెస్ట్ సెల్లర్ అనే టీవీ షో ప్రసారం కానుంది. థ్రిల్లర్, డ్రామాగా దీన్ని రూపొందించారు. ఈ నెల 18వ తేదీన అమెజాన్‌లో మెప్పాడియాన్ అనే మళయాళం సినిమా స్ట్రీమ్ కానుంది. డ్రామా, థ్రిల్లర్‌గా ఈ మూవీని తీశారు.
ఈ నెల 18వ తేదీన సోనీ లివ్‌లో హోమ్ కమింగ్ అనే సినిమా స్ట్రీమ్ కానుంది. అదే తేదీన సోనీ లివ్‌లోనే విశాల్, ఆర్య నటించిన ఎనిమీ చిత్రం స్ట్రీమ్ కానుంది. యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషల్లో అందిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18వ తేదీన కపిల్ దేవ్ బయోపిక్ మూవీ 83ని స్ట్రీమ్ చేయనున్నారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ అదే తేదీ రోజు స్ట్రీమ్ కానుంది. ఈ నెల 18న నెట్‌ఫ్లిక్స్ లో టెక్సాస్ చెయిన్‌సా మసాకర్ అనే మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. హార్రర్ జోనర్‌లో ఈ మూవీని నిర్మించారు.
ఈ నెల 18వ తేదీన జీ5 యాప్‌లో నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. అదే రోజు ఇదే యాప్‌లో దృశ్య 2 అనే కన్నడ సినిమాను ప్రసారం చేయనున్నారు. అదే తేదీన జీ5 యాప్‌లోనే విళంగు అనే తమిళ సినిమాను స్ట్రీమ్ చేయనున్నారు. క్రైమ్, డ్రామా జోనర్‌లో ఈ మూవీని తీశారు.
ఈ నెల 18వ తేదీన ఆహాలో ఇరై అనే తమిళ సిరీస్‌ను ప్రసారం చేస్తారు. క్రైమ్, థ్రిల్లర్ జోనర్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.