Muntha Masala : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ముంత మ‌సాలా.. ఇలా చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది..!

Muntha Masala : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, బీచ్ ల ద‌గ్గ‌ర ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ముంత మ‌సాలా కూడా ఒక‌టి. ముంత మ‌సాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ఈ ముంత మ‌సాలాను త‌యారు చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే గుంటూరు స్పెష‌ల్ ముంత మ‌సాలా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయడం కూడా చాలా సుల‌భం. స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే గుంటూరు స్పెష‌ల్ ముంత మ‌సాలాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముంత మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మందంగా ఉండే అటుకులు – ఒక క‌ప్పు, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా, ప‌ల్లీలు – గుప్పెడు, రాత్రంతా నాన‌బెట్టిన బ‌ఠాణీలు – అర క‌ప్పు, మామిడికాయ తురుము – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్న‌గా తరిగిన ట‌మాట – చిన్న‌ది ఒక‌టి, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – కొద్దిగా, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.

Muntha Masala recipe in telugu tasty snack to make
Muntha Masala

ముంత మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా బ‌ఠాణీల‌ను కుక్క‌ర్ లో వేసి అందులోనే ఉప్పు, ప‌సుపు వేసి మెత్త‌గా ఉడికించి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక అటుకుల‌ను వేసి వేయించాలి. త‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. అదే నూనెలో ప‌ల్లీలు కూడా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఉడికించిన బ‌ఠాణీల‌తో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి బాగా క‌లుపుకోవాలి. చివ‌ర‌గా పైన ప‌ల్లీలు, కొత్తిమీర చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముంత మ‌సాలా తయార‌వుతుంది. దీనిని పిల్ల‌లతో పాటు ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్పుడ‌ప్పుడూ ఇలా ముంత మ‌సాలాను త‌యారు చేసుకుని తినవ‌చ్చు.

D

Recent Posts