Visiting Places In Tirumala : చాలామంది ప్రతి ఏటా తిరుపతి వెళుతుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే, అనుకున్న పనులు పూర్తవుతాయని నమ్ముతారు. అందుకని, ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుపతికి సమీపంలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఈసారి, తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు, ఈ ప్రదేశాలని కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. తిరుపతికి సమీపంలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు చూస్తే.. శ్రీ వరహస్వామి ఆలయం. తిరుమల కి సమీపంలో ఉంది. తిరుమల కి ఉత్తరాన ఉన్న, ఈ ప్రసిద్ధి ఆలయం విష్ణు అవతారమైన వరాహ స్వామికి అంకితం చేయబడింది.
వెంకటేశ్వర స్వామి ఇక్కడే నివాసముండేవారని ప్రతీతి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా, కచ్చితంగా దర్శించుకోవాలి. ఇది వెంకటేశ్వర స్వామి భార్య అలానే తల్లి లక్ష్మీ అవతారం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే, తిరుమల యాత్ర పూర్తయినట్లు. తిరుపతికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో, తిరుమల కొండ కింద ఉన్న ఏకైక శివాలయం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కపిల తీర్థం అనే నీటి బుగ్గ కూడా ఉంది.
తిరుమల వెళ్లే వాళ్ళు శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా, ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఈ ఆలయం తిరుపతి మధ్యలో ఉంది. సీతారామలక్ష్మణులు ఇక్కడ ఉంటారు. నిత్యం పూజలు జరుపుతారు. ఇది కోదండ రామస్వామి ఆలయానికి ఉపదేవాలయం. అలానే, తిరుమల వెళ్లే వాళ్ళు, కచ్చితంగా గోవిందరాజు స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాసమంగాపురం కూడా. కచ్చితంగా భక్తులు దర్శించుకుంటూ వుంటారు. అలానే తిరుమల వెళ్ళిన వాళ్ళు, పాపవినాశనం పుణ్యక్షేత్రానికి కూడా కచ్చితంగా వెళ్తుంటారు. ఇది తిరుపతికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో వైకుంఠ తీర్థం అనే పర్వతం కూడా ఉంది. సప్తగిరులు అంటే ఏడు కొండలు. సప్త ఋషి అని కూడా దీనిని అంటారు. ఇలా ఇక్కడికి వెళ్లిన వాళ్ళు, మళ్ళీ కచ్చితంగా వీటిని దర్శించుకుంటే మంచిది.