Mutton Curry : మ‌ట‌న్ క‌ర్రీని ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేసి చూడండి.. బగారా అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Mutton Curry : మ‌న‌లో చాలా మంది మ‌ట‌న్ ను ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా అందుతాయి. మ‌ట‌న్ తో ఎక్కువ‌గా త‌యారు చేసే వంట‌కాల్లో మ‌ట‌న్ క‌ర్రీ కూడా ఒక‌టి. మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ మ‌ట‌న్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌ట‌న్ క‌ర్రీని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర‌- కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – 400 ఎమ్ ఎల్.

Mutton Curry recipe tastes better with rice
Mutton Curry

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర‌కిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, అనాస పువ్వు – 1, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు కంటే కొద్దిగా త‌క్కువ‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 4,బిర్యానీ ఆకు – చిన్న‌ది ఒక‌టి, మిరియాలు – అర టీ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, జీడిప‌ప్పు – 5, ఎండుమిర్చి – 4.

మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో క‌డిగిన మ‌ట‌న్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి అర‌గంట పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి ముందుగా మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి మ‌రో నిమిషం పాటు వేయించాలి.

త‌రువాత మ్యారినేట్ చేసుకున్న మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మ‌సాలా పేస్ట్ వేసి మ‌రో క‌లిపి మ‌రో 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఈ క‌ర్రీలో నీళ్లు ఎక్కువ‌గా ఉంటే మ‌రి కొద్ది సేపు ఉడికించి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పూరీ, బ‌గారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts