Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Mutton Korma : ఫంక్ష‌న్ల‌లో చేసిన‌ట్లు మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
February 6, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Mutton Korma : మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి. మ‌ట‌న్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, దోశ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. మ‌ట‌న్ కుర్మాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా మ‌ట‌న్ కుర్మాను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా, అంద‌రికి న‌చ్చేలా మ‌ట‌న్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర‌కిలో, న‌ల్ల‌యాల‌క్కాయ – 1, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జాప‌త్రి – కొద్దిగా, మిరియాలు – 10, నాన‌బెట్టిన జీడిప‌ప్పు – 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, ఎండుకొబ్బ‌రి ముక్క – 2 ఇంచుల ముక్క‌, నూనె – 5 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చిలిక‌న పెరుగు – పావు లీట‌ర్ , నీళ్లు – 2 క‌ప్పులు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Korma recipe make like this for taste
Mutton Korma

మ‌ట‌న్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా జార్ లో బ్రౌన్ ఆనియ‌న్స్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో జీడిప‌ప్పు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనినిప‌చ్చివాస‌న పోయే వ‌రకు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి.ఇందులోనే ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి కల‌పాలి.

త‌రువాత మూత పెట్టి మ‌ట‌న్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి మ‌ర‌లాస్ట‌వ్ ఆన్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న బ్రౌన్ ఆనియ‌న్స్, జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌రకు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా వేసి మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన మ‌ట‌న్ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Mutton Korma
Previous Post

Cooking Vessels : వంట వండేందుకు మీరు ఎలాంటి పాత్ర‌ల‌ను వాడుతున్నారు..? ఇవి అయితే బెట‌ర్‌..!

Next Post

Coriander Water : ధ‌నియాల నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.