Naga Chaithanya : నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాక.. సమంత ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలకు, షికార్లకు వెళ్తోంది. అలాగే వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం బయటి ప్రపంచానికి దూరంగానే ఉంటున్నాడు. దీంతో విడాకుల విషయాన్ని అతను ఇంకా మరిచిపోలేదని అర్థమవుతోంది.
అయితే సోషల్ మీడియాలోనూ సమంతే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. నాగచైతన్య ఎప్పుడో కానీ పోస్టులు పెట్టడు. ట్వీట్లు చేయడు. అది కూడా తన లేదా తనకు కావల్సిన వారి సినిమాలు, ఇతర విషయాలు ఉంటే నాగచైతన్య అప్‌డేట్స్ ఇస్తుంటాడు. కాగా.. తాజాగా నాగచైతన్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారడమే కాదు.. అందరినీ అయోమయానికి, గందరగోళానికి గురి చేసింది.
నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే ఇష్టం కదా. అతను వాటితో రేసింగ్‌లు కూడా చేస్తుంటాడు. అయితే స్వతహాగా ఆ ఆసక్తి ఉన్న చైతూ తాజాగా ఓ ప్రముఖ రేసర్ గ్రేజీ వాలే గురించి ట్వీట్ చేశాడు.
#GrazieVale ????
— chaitanya akkineni (@chay_akkineni) November 14, 2021
అయితే చైతూ చేసిన ట్వీట్ కు అర్థం తెలియక చాలా మంది జుట్టు పీక్కున్నారు. ఏంటీ.. ఇంత గందరగోళానికి గురి చేశాడని.. అందరూ అయోమయానికి లోనయ్యారు. కానీ చివరకు అతను పెట్టిన ట్వీట్ ఓ రేసర్ గురించని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. గ్రేజీ వాలే ఫేమస్ రేసర్ అని, అతను తాజాగా చివరిసారిగా రైడ్ చేసి అందరికీ ఫేర్‌వెల్ చెప్పాడని వార్తలు వచ్చాయి. దీంతో ఆ విషయంపై చైతూ ట్వీట్ చేశాడు.
అయితే ట్వీట్‌లో గ్రేజీ వాలే అనే పేరు ఒక్కటే ఉండడంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అయినప్పటికీ విషయం తెలిశాక అందరూ.. ఓహో.. అదా.. అని శాంతించారు. కాగా చైతూ ప్రస్తుతం బంగార్రాజు అనే చిత్రంలో నటిస్తున్నాడు. అతను నటించిన లవ్ స్టోరీ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.