Nagachaitanya : సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎప్పుడో తన సినిమాల అప్‌డేట్స్ వచ్చినప్పుడు లేదా తనకు ఇష్టమైన కార్లు, టూవీలర్స్ గురించి ఎప్పుడో ఒకసారి చైతూ పోస్టులు పెడుతుంటాడు. అంతే.. అయితే అలా ఎప్పుడో ఒకసారి పోస్టులు పెట్టినా.. చైతూకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య సోషల్ మీడియాలో మరో మైలురాయిని అధిగమించాడు. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకడైన నాగచైతన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆ ఫాలోవర్ల సంఖ్య 70 లక్షలు దాటింది.
నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో అంతగా యాక్టివ్‌గా ఉండడు. కానీ ఆయనకు ఫాలోవర్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 70 లక్షలు దాటింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా మరోవైపు సమంతకు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో 2.27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సమంత తరచూ తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది కనుక సహజంగానే ఆమెకు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు.. హీరోయిన్లు చాలా మందికి ఇలాగే ఫాలోవర్లు అధికంగా ఉంటారు. అయితే చైతన్య మాత్రం తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మైలురాయిని అయితే సాధించాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చైతూ ఈ మధ్యనే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్ యూ అనే సినిమాను పూర్తి చేశాడు. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న దూత అనే సూపర్‌నాచురల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ చైతన్య నటిస్తున్నాడు. ఇందులో ప్రియా భవాని, మళయాళం నటి పార్వతి తిరువొతులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హిందీలో తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీలోనూ చైతూ నటించాడు. ఇందులో అమీర్‌ఖాన్ లీడ్ రోల్ చేశారు. ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.