Nivetha Pethuraj : టాలీవుడ్ ఇండస్ట్రీలో నివేతా పేతురాజ్ కు వచ్చిన ఆఫర్లు తక్కువే. కొన్ని బడా చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. చిన్న సినిమాల్లో చేసినా.. అవి హిట్ కాలేదు. దీంతో ఈమెకు ఆఫర్లు ఈ మధ్య తగ్గాయనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఈమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. రవితేజ పక్కన ఈమె హీరోయిన్‌గా నటించనుంది.
విశ్వక్‌సేన్ సినిమా దాస్ కా ధమ్‌కీలో ప్రస్తుతం నివేతా నటిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే రవితేజ పక్కన నటించనుంది. గతంలో ఈమె హీరోయిన్‌గా రెడ్, చిత్రలహరి, పాగల్ సినిమాలు వచ్చాయి. కానీ ఇవేవీ ఈమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయితే రవితేజ పక్కన నటిస్తే ఆ మూవీ హిట్ అయితే ఈమె కెరీర్ మలుపు తిరుగుతుందనే చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 154వ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఇందులో చిరంజీవి పక్కన హీరోయిన్ గా శృతి హాసన్ నటించనుంది. ఈ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ చేయనున్నారు. ఆయన పక్కనే నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ సినిమాతో అయినా ఈమె ఫేట్ మారుతుందో.. లేదో.. చూడాలి.