Electric Scooter : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా ? ఫైనాన్స్ సదుపాయంతో వాహనం తీసుకోవాలని భావిస్తున్నారా ? సిబిల్ స్కోరు లేక రుణం పొందలేకపోతున్నారా ? అయితే.. మీకోసమే ఈ ఆఫర్. సిబిల్ స్కోర్ అసలు లేకపోయినా.. ఎంచక్కా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. అవును.. ఇది నిజమే. సిబిల్ స్కోర్ లేనివారికి కూడా టూవీలర్ లోన్స్‌ను ప్రస్తుతం అందజేస్తున్నారు. ఇందుకు గాను ఏథర్ ఎనర్జీ సంస్థ శ్రీకారం చుట్టింది.
ఏథర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే భిన్న రకాల మోడల్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి ఆదరణ పొందింది. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలకు అమ్మకాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ వాహనాలను కొనుగోలు చేయాలంటే.. సిబిల్ స్కోరు లేనివారు వీటిని పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ కంపెనీ రెండు ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం అయి సిబిల్ స్కోరు లేని వారికి కూడా వాహన రుణాలను అందజేస్తూ.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది.
ఏథర్ ఎనర్జీ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పుడు ఎంతో సులభంగా ఫైనాన్స్ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. అందుకు గాను హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు సిబిల్ స్కోరు లేని వారికి కూడా టూవీలర్ లోన్స్‌ను అందిస్తున్నాయి. చాలా సులభంగా రుణాన్ని పొంది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక టూవీలర్ ధరలో గరిష్టంగా 95 శాతం వరకు లోన్ పొందే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ లోన్‌ను గరిష్టంగా 3 ఏళ్ల కాల పరిమితితో చెల్లించే వీలును కూడా కల్పిస్తున్నాయి. అందువల్ల సిబిల్ స్కోరు లేనివారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఏథర్ కంపెనీకి చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ సంస్థకు చెందిన టూవీలర్‌ను కొనుగోలు చేయాలంటే.. సమీపంలో ఉన్న స్టోర్‌ను సందర్శించాల్సి ఉంటుంది.