RRR : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజ లు హీరోలుగా త్వరలో రిలీజ్ అవుతున్న చిత్రం RRR. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది దసరా అన్నారు. తరువాత సంక్రాంతి అన్నారు. కానీ పలు కారణాలతో వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక RRR సినిమాకు గాను రామ్ చరణ్, ఎన్‌టీఆర్ లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ? అని ప్రేక్షకులు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే.. ఈ సినిమాకు వారిద్దరూ చెరో రూ.45 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన అజయ్ దేవగన్, ఆలియా భట్ లు కూడా భారీగానే అందుకున్నట్లు తెలుస్తోంది. వీరు సినిమాలో కనిపించేది కొంత సేపే. అయినా రెమ్యునరేషన్‌ను మాత్రం ఎక్కువగానే తీసుకున్నారట.
కాగా RRR సినిమాకు గాను అజయ్ దేవగన్‌కు రూ.25 కోట్లు, ఆలియా భట్‌కు రూ.9 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు గాను మార్చి 14వ తేదీ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను చేయనున్నారు. దీంతో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.