NTR : సాధారణంగా సెలబ్రిటీలు సినిమా షూటింగ్స్ ఉంటే ఫ్యామిలీకి కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటారు. తరచూ కలుస్తుంటారు. కానీ ఫ్యామిలీతో గడిపే సమయం తక్కువగానే ఉంటుంది. ఇక షూటింగ్ లు లేని సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఎన్‌టీఆర్ అయితే ఈ విషయంలో ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పవచ్చు. ఆయన షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో మాత్రం కచ్చితంగా సమయం గడుపుతుంటారు. అయితే ఒక సమయంలో మాత్రం ఎన్‌టీఆర్ తన ఫ్యామిలీకి చాలా రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చిందట. దీంతో ఈ విషయం ఆయనపై మానసికంగా ప్రభావం చూపించిందట.
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ చేసే సమయంలో దేశంలో కరోనా ఒక రేంజ్‌లో ఉంది. ఆ సమయంలో షూటింగ్‌లకు అనుమతులు లభించడమే కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఒక దశలో ఆంక్షలను సడలించినప్పుడు ఈ మూవీ షూటింగ్ చేశారు. అయితే కరోనా కనుక ఎన్‌టీఆర్ షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్లలేదట. హోటల్‌లోనే గడిపారట. ఇంట్లో పిల్లలు, వృద్ధురాలు అయిన తల్లి ఉంది కనుక.. వారికి కరోనా సోకుతుందేమోనని ఎన్‌టీఆర్ భయపడ్డారట. దీంతో ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు షూటింగ్ కాగానే నేరుగా హోటల్‌కు వెళ్లేవారట. ఇలా ఒక సమయంలో ఆయన చాలా రోజుల పాటు తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్‌టీఆర్ మానసికంగా కృంగి పోయారట. అయితే ఎట్టకేలకు ఫ్యామిలీని కలిశాక.. ఆయన మళ్లీ మామూలు మనిషి అయ్యారట.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాను దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ కూడా మరో కీలకపాత్రలో నటించారు. వీరి పక్కన ఒలివియా మోరిస్, ఆలియా భట్‌లు హీరోయిన్లుగా నటించారు. నిర్మాత డీవీవీ దానయ్య.. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10వేల థియేటర్లలో మార్చి 25వ తేదీన విడుదల కానుంది.
ఇక ఎన్‌టీఆర్ త్వరలోనే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో మళ్లీ పాల్గొననున్నారు. తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సినిమా చేయనున్నారు. అందులో ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె స్వయంగా వెల్లడించింది.