Onion Pulusu : ఉల్లిపాయ వంటగది ఉండదనే చెప్పవచ్చు. ఉల్లిపాయలను మనం వంటలల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలు కూరకు రుచిని తేవడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయల వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని మనం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఉల్లిపాయలతో పులుసును ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 2, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, మెంతులు – 10, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ.
ఉల్లిపాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, మెంతులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు రసం, అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే పులుసును తయారు చేసుకుని తినవచ్చు. దీనిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.