Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Palak Kofta Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ.. ఇలా చేసుకోవ‌చ్చు..!

D by D
July 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Palak Kofta Curry : మ‌నం పాలకూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పాల‌కూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే పాల‌కూర‌తో ఎప్పుడూ ప‌ప్పు, కూర, పాల‌క్ రైస్ వంటి వాటినే కాకుండా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కోఫ్తా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ పాల‌క్ కోప్తా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాల‌క్ కోఫ్తా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌క్ కోఫ్తా కర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్, ట‌మాటాలు – పెద్ద‌వి మూడు, ఉప్పు -త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Palak Kofta Curry recipe in telugu make it in restaurant style
Palak Kofta Curry

కోఫ్తా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, చిన్న‌గా త‌రిగిన చిన్న ఉల్లిపాయ – 1, పాల‌కూర – 100 గ్రా., ఉప్పు – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప – 1, కార్న్ ఫ్లోర్ -ఒక టీ స్పూన్, మైదాపిండి -ఒక టీ స్పూన్.

పాల‌క్ కోఫ్తా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా పాల‌కూర ఆకుల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి మెత్త‌గా ఉడికించాలి. ఇప్పుడు కోఫ్తాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉడికించిన పాల‌కూర వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ఇందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసిక‌ల‌పాలి.

త‌రువాత దీనిని చిన్న నిమ్మ‌కాయంత పరిమాణంలో ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఈ ఉండ‌ల‌పై కొద్దిగా మైదాపిండిని చ‌ల్లుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోఫ్తా బాల్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ త‌యారీకి క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో నిమిషం పాటు వేయించిన త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని కూడా నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన కోఫ్తా బాల్స్ వేసి మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ కోఫ్తా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: palak kofta curry
Previous Post

Prawns Masala Curry : హోట‌ల్ స్టైల్‌లో ప్రాన్స్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

Next Post

Cloves Milk : రోజూ రాత్రి పాల‌లో దీన్ని క‌లిపి తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.