Panasa Vada : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో వడలు కూడా ఒకటి. వడలు చాలా రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే తరుచూ ఒకేరకం వడలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే పనస వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పనస తొనలతో చేసిన వడ మిక్స్ తో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పనస వడ మిక్స్ మనకు సూపర్ మార్కెట్ లో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది. పనస వడ మిక్స్ తో చేసిన వడలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎంతో రుచిగా ఉండే పనస వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – లీటర్, ఉ్పు – తగినంత, పల్లి నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు- ఒక టీ స్పూన్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం తరుగు – ఒక టీస్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు -చిటికెడు, పనస వడ మిక్స్- ఒక ప్యాకెట్.
పనస వడ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఇందులో నుండి ఒక కప్పు పెరుగును మరో గిన్నెలోకి తీసుకుని ఒక లీటర్ నీటిని పోసి తగినంత ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి.ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న పెరుగులో వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెలో పనస వడ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. ఈ పిండిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక చేతులకు తడి చేసుకుంటూ పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత ఈ వడలను ముందుగా తయారు చేసుకున్న మజ్జిగలో వేసి 5 నిమిషాలపాటు ఉంచాలి. తరువాత ఈ వడలను తీసి పెరుగులో వేసుకోవాలి. వీటిని అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనస వడలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.