Paper Plate Making : నిరుద్యోగులు, మ‌హిళ‌ల‌కు చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి.. పేప‌ర్ ప్లేట్ బిజినెస్‌..!

Paper Plate Making : ప్ర‌స్తుత కాలంలో ఈ పోటీ ప్ర‌పంచంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలా మందికి ఉద్యోగాలు రావ‌డం లేదు. దీంతో కొంద‌రు స్వ‌యం ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు. త‌మకు న‌చ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని అందులో రాణిస్తున్నారు. రూ.ల‌క్ష‌ల కొద్దీ ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే కాస్త ఓపిక‌, శ్ర‌మ ఉండాలే కానీ.. నిరుద్యోగులు సొంతంగా చేసుకునేందుకు అనేక వ్యాపార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పేప‌ర్ ప్లేట్స్ తయారీ బిజినెస్ ఒక‌టి.

Paper Plate Making is a very good self employment for women and unemployed
Paper Plate Making

త‌క్కువ ఖ‌ర్చుతోనే ఎక్కువ లాభాల‌ను తెచ్చి పెట్టే వ్యాపారాల‌లో ఇది ఒక‌టి. గృహిణిలు, నిరుద్యోగులు కూడా ఈ వ్యాపారాన్ని ఎంతో సులువుగా చేయ‌వ‌చ్చు. ఈ వ్యాపారం చేయడానికి కాస్త శ్ర‌మించాల్సి ఉంటుంది. ఇక పెట్టుబ‌డి కూడా పెద్ద‌గా ఏమీ ఉండ‌దు. మ‌నం పెట్టే పెట్టుబ‌డికి అనుగుణంగా ఈ వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి. ఇక ఈ వ్యాపారం చేసేందుకు కావ‌ల్సిన పెట్టుబ‌డి, ఇత‌ర ఖ‌ర్చులు, లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పేప‌ర్ ప్లేట్స్ ను త‌యారు చేసే మెషిన్ ను ముందుగా తీసుకోవాలి. ఈ మెషిన్ ల‌లో మూడు ర‌కాలు ఉంటాయి. మొద‌టిది మ్యానువ‌ల్ మేకింగ్ మిషిన్‌. దీని ధ‌ర రూ.15 వేల నుండి రూ.20 వేల వ‌ర‌కు ఉంటుంది. రెండ‌వ‌ది సెమీ ఆటోమేటిక్ మెషిన్‌. దీని ధ‌ర రూ.40 వేల వ‌ర‌కు ఉంటుంది. మూడ‌వ‌ది ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్‌. దీని ధ‌ర రూ. 1 ల‌క్ష వ‌ర‌కు ఉంటుంది. ఈ బిజినెస్ ను ప్రారంభించే వారికి సెమీ ఆటోమెటిక్ మెషిన్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ మెషిన్ వ‌ల్ల ముడి స‌రుకుల‌తో మ‌నం ఎంతో సులువుగా పేప‌ర్ ప్లేట్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

ఒక రోజుకి మ‌నం 8 గంట‌లు ప‌ని చేయ‌డం వల్ల సుమారుగా 8 వేల పేప‌ర్ ప్లేట్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్కో ప్లేటుపై అన్ని ఖ‌ర్చులు పోయిన త‌రువాత‌ 15 పైస‌లు మిగులుతాయి. రోజుకి 8 వేల ప్లేట్ల‌కు గాను అన్ని ఖ‌ర్చులు పోగా రూ.1200 మిగులుతాయి. ఎక్కువ గంట‌లు ప‌ని చేయ‌డం వ‌ల్ల రూ.1200 కంటే ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. రోజుకి రూ.1200 చొప్పున నెల‌కు రూ.36 వేలను మ‌నం సంపాదించ‌వ‌చ్చు.

ఈ మెషిన్ తో మ‌నం 4 లేదా 5 ర‌కాల ప్లేట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మిషిన్ తో మ‌నం ఇంట్లో కూడా ప్లేట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మెషిన్ స‌హాయంతో ఎవ‌రైనా కూడా చాలా సులువుగా ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ప్లేట్ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు త‌ప్పని స‌రిగా త‌గిన జాగ్ర‌త్త‌లను తీసుకోవాలి. ఇందులో తెలిపిన మెషిన్ ధ‌ర‌లు, ఖ‌ర్చులు, మిగులు సంపాద‌న కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. మ‌న‌కు వ‌చ్చే ఆర్డ‌ర్స్‌, మార్కెటింగ్, మ‌నం చేసే ప‌ని గంట‌ల‌పై మ‌న మిగులు సంపాద‌న ఆధార‌ప‌డి ఉంటుంది. అలాగే ఈ మెషిన్‌లు, పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డే రా మెటీరియ‌ల్ ధ‌ర‌లు మార్కెట్‌లో ఎప్ప‌టి క‌ప్పుడు మారుతుంటాయి. క‌నుక ఈ వ్యాపారం చేసేవారు ముందుగా దీని గురించి కాస్త అవ‌గాహ‌న క‌ల్పించుకోవాలి. క్షుణ్ణంగా ప‌రిశీలించాకే ఈ వ్యాపారం చేయాలి. దీంతో అనుకున్న విధంగా డ‌బ్బులు సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది.

D

Recent Posts