Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం.. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై జీవో రానప్పటికీ ఆ ప్రభావం భీమ్లా నాయక్‌పై పెద్దగా పడలేదని అంటున్నారు. ఈ క్రమంలో సినిమా ఘన విజయం సాధించి.. రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై దృష్టి సారించారు. అలాగే తన తదుపరి సినమాలపై ఫోకస్ పెట్టారు.
పవన్ కల్యాణ్ తాజాగా హైదరాబాద్‌లో ఓ పోష్ ఏరియాలో భారీ విస్తీర్ణం కలిగిన ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఖాజాగూడ అనే ఏరియాలో ఆయన 1200 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఓ ప్లాట్‌ను కొన్నారట. అక్కడ భూమి ధర ఒక చదరపు గజానికి రూ.2 లక్షలుగా ఉందని సమాచారం. దీంతో పవన్ కొన్న ప్రాపర్టీ ఖరీదు రూ.24 కోట్ల మేర ఉంటుందని తెలుస్తోంది.
ఆ ఏరియాలో ఇప్పటికే అనేక విద్యాసంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఓ పాపులర్ స్కూల్‌కు ఎదురుగా పవన్ ప్లాట్‌ను కొన్నారట. తనకు సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ను పవన్ సహజంగానే రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడి పెడుతుంటారు. హైదరాబాద్‌లోని ప్రైమ్ లొకేషన్‌లో ఇప్పటికే ఆయనకు ఫామ్ హౌస్ ఉంది. దానికి దగ్గర్లోనే ఇప్పుడు కొత్త ప్లాట్‌ను తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఆయన త్వరలో రియల్ ఎస్టేట్ బిజినెస్‌పై మరింత ఫోకస్ పెడతారని అంటున్నారు.