viral news

Viral Video : దున్న‌పోతుతో ప‌రాచికాలు ఆడారు.. విసిరి అవ‌త‌ల‌ ప‌డేసింది.. వీడియో..!

Viral Video : మ‌నం ఈ జ‌న్మ‌లో చేసిన పాపాల‌కు వ‌చ్చే జ‌న్మ‌లో శిక్ష‌ను అనుభ‌విస్తామ‌ని పురాణాలు చెబుతున్నాయి. అందుక‌నే ఈ జ‌న్మ క‌ర్మ ఫ‌లాన్ని వ‌చ్చే జ‌న్మ‌లో అనుభ‌విస్తామ‌ని చెబుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఈ జ‌న్మ క‌ర్మ ఫ‌లాన్ని ఈ జ‌న్మ‌లోనే.. ఇంకా చెప్పాలంటే.. అప్ప‌టికప్పుడే దాన్ని అనుభ‌విస్తారు. అప్పుడు చేసిన త‌ప్పుల‌కు అప్పుడే.. వెంట‌నే క‌ర్మ‌ఫ‌లాన్ని అనుభ‌విస్తారు. అవును.. వారికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

ఒక దున్న‌పోతును చిన్న‌పాటి బండికి క‌ట్టేసి దాని మీద కొంద‌రు కూర్చుని రోడ్డుపై వేగంగా వెళ్ల‌డం మొద‌లు పెట్టారు. వారు నెమ్మ‌దిగా వెళదాం అని అనుకోలేదు. దున్న‌పోతును చిత్ర హింస‌ల‌కు గురి చేశారు. కర్ర‌తో కొడుతూ దాన్ని వేగంగా వెళ్లేలా చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దున్న‌పోతు డివైడ‌ర్‌కు మీదుగా రోడ్డుకు అవ‌త‌లి వైపుకు వెళ్లింది. దీంతో డివైడర్‌ను ఢీకొట్టిన ఆ బండి వెంట‌నే బోల్తా ప‌డింది. అందులో కూర్చున్న వారంద‌రూ దూరంగా విసిరేసిన‌ట్లు ఎగిరిప‌డ్డారు. అయితే ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. దీనికి సంధించిన వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

people on bike and buffalo

ఇక ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంద‌రూ ఆ దున్న‌పోతుకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. బాగా అయింది వెధ‌వ‌ల‌కి.. జంతువుల‌ను ఇలా హింసించే వారికి ఇలాగే జ‌ర‌గాలి.. క‌ర్మ ఫ‌లం అంటే ఇదే.. అంటూ చాలా మంది ర‌కరకాల కామెంట్లు పెడుతున్నారు.

Admin

Recent Posts