Plants For Wealth : ఇంట్లో ఈ 5 ర‌కాల మొక్క‌ల‌ను పెంచితే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Plants For Wealth : మ‌న‌లో ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. ఎంత క‌ష్ట ప‌డి సంపాదించినా డ‌బ్బు నిల‌బ‌డ‌క, సంపాద‌న కంటే ఖ‌ర్చు అధిక‌మై బాధ ప‌డే వారు, చేస్తున్న వ్యాపారం స‌రిగ్గా సాగ‌క‌, ఇంట్లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇలా అనేక ర‌కాల ఇబ్బందుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ ఇబ్బందుల పాల‌వ‌డానికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. గ్ర‌హ స్థితి బాగాలేక పోవ‌డం వ‌ల్ల, ఇంట్లో వాస్తు దోషాలు ఉండ‌డం వ‌ల్ల న‌ర దిష్టి త‌గల‌డం వ‌ల్ల ఇలా అనేక కార‌ణాల చేత మ‌నం ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం ఇంట్లో ఈ ఐదు ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకోవాల‌ని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల మ‌న ఇంట్లో ఉండే అన్ని ర‌కాల ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ని, మ‌న ఇంటి ద‌రిదాపుల్లోకి కూడా ఎటువంటి దుష్ట‌ శ‌క్తులు రావ‌ని, మ‌న ఇంటికి ఉండే వాస్తు దోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ని వారు చెబుతున్నారు.

ఈ ఐదు ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల మ‌న ఇంటి చుట్టూ, మ‌న ఇంట్లో ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ట‌. అంతేకాకు ల‌క్ష్మీ దేవి కటాక్షాన్ని కూడా మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌న ఇంట్లో పెంచుకోవాల్సిన ఈ ఐదు ర‌కాల మొక్క‌లు ఏమిటి.. మ‌న‌కు అష్టైశ్వర్యాల‌ను, భోగ భాగ్యాల‌ను ప్ర‌సాదించే ఆ మొక్క‌లు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఇంట్లో పెంచుకోవాల్సిన ఐదు మొక్క‌ల్లో మొద‌టిది తుల‌సి మొక్క‌. తుల‌సి మొక్క ఎక్క‌డ ఉంటుందో అక్క‌డ ల‌క్ష్మీ దేవి త‌ప్ప‌క ఉంటుంది. ఇక మ‌నం పెంచుకోవాల్సిన మొక్క‌ల్లో రెండ‌వ‌ది మారేడు మొక్క‌. ఈ మొక్క‌ను త‌ప్ప‌కుండా ఇంట్లో పెంచుకోవాల‌ట‌.

Plants For Wealth grow these in your home for money
Plants For Wealth

అలాగే మ‌నం పెంచుకోవాల్సిన మొక్క‌ల్లో మూడ‌వది అర‌టి మొక్క‌. ఈ మొక్క ఇంట్లో ఉన్న వారు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటార‌ట‌. అదే విధంగా మ‌నం పెంచుకోవాల్సిన వాటిల్లో నాలుగ‌వ‌ది ఉసిరి మొక్క‌. ఈ మొక్క ఉన్న వారి ఇంట్లో ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఇక మ‌నం పెంచుకోవాల్సిన వాటిల్లో చివ‌రి మొక్క క‌ల‌బంద‌. త‌ప్ప‌కుండా అంద‌రూ ఇంట్లో పెంచుకోవాల్సిన వాటిల్లో క‌ల‌బంద మొక్క ఒక‌టి. ఈ మొక్క నుండి వ‌చ్చే పాజిటివ్ ఎన‌ర్జీ మ‌నం ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించేలా చేస్తుంది. క‌ల‌బంద మొక్క ఉన్న వారి ఇంట్లోకి ఎటువంటి దుష్ట శ‌క్తులు కూడా రావు. ఈ ఐదు ర‌కాల మొక్క‌ల‌ను మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకోవ‌డంతోపాటు ఇవి ఎండిపోకుండా ప్ర‌తిరోజూ నీళ్లు పోయాలి. ఇలా చేయ‌డం వల్ల మ‌నకు వ‌చ్చే ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోయి మ‌న ఇల్లు సుఖశాంతుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుందని పండితులు చెబుతున్నారు.

D

Recent Posts