Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Poha Bread Vada : బ్రెడ్‌, అటుకులు క‌లిపి ఇలా వ‌డ‌ల‌ను చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

D by D
January 12, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Poha Bread Vada : బ్రెడ్ పోహ వ‌డ‌లు.. అటుకులు, బ్రెడ్ క‌లిపి చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అల్పాహారంగా, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. వీటిని కేవ‌లం 10 నుండి 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ పోహ వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ పోహ వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

అటుకులు – అర క‌ప్పు, బ్రెడ్ స్లైసెస్ – 4, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Poha Bread Vada recipe in telugu make in this way
Poha Bread Vada

బ్రెడ్ పోహ వ‌డ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో అటుకుల‌ను తీసుకోవాలి. త‌రువాత వీటిని 2 నుండి 3 సార్లు శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత బ్రెడ్ స్లైసెస్ ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇందులో నీళ్లు వేయ‌కుండా క‌లుపుకోవాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత చేతుల‌కు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ వ‌డ‌లాగా వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక వ‌డ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంటపై రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పోహ వ‌డ‌లు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ట‌మాట కిచ‌ప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.

Tags: Poha Bread Vada
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sleeplessness : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు త‌గినంత‌గా నిద్ర‌పోవ‌డం లేద‌ని అర్థం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.