Poonam Kaur : నటి పూనమ్ కౌర్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఇప్పటికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంటనే వాటిని డిలీట్ చేసింది. తనను ఓ అగ్ర హీరో మోసం చేశాడని గతంలో ఈమె సంచలన ఆరోపణలు చేసింది. అప్పట్లో సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా నటి పూనమ్ కౌర్‌కు అన్యాయం జరిగిందని కొన్ని ఆధారాలను బయట పెట్టారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనం అయింది. అయితే తరువాత రాను రాను పూనమ్ కౌర్ ట్వీట్లు చేయడం మానేసింది.
కానీ ఈమె ఓ వైపు వివాదాస్పద ట్వీట్లు పెడుతూనే మరో వైపు వెంటనే వాటిని డిలీట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఈమె ఇలాగే చేసింది. ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేసింది. కానీ వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆమె ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె మరోమారు సంచలన ఆరోపణలు చేసింది.
తాజాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఇందులో పాల్గొన్న పవన్‌ను ఉద్దేశించి పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్ చేసింది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వాన్ని తనకు ఇష్టమైన వాళ్లు వదులుకున్నారని.. సినిమా అవసరం కోసం రాజకీయ నాయకుల వద్ద చేతులు కట్టుకుని నిలబడడం తనకు నచ్చలేదని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌ను ఆమె వెంటనే డిలీట్ చేసింది.
ఇక ఈ ట్వీట్‌ను ఆమె పవన్‌ను ఉద్దేశించి చేసిందేనని స్పష్టంగా అర్థమవుతుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలోనే ఆమె ఈ ట్వీట్‌ను చేయగా.. వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయితే పూనమ్ కౌర్ ఎల్లప్పుడూ ఇలాగే ట్వీట్స్ చేస్తుంటుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమె చేసే ట్వీట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ విషయంలో పూనమ్‌కు మద్దతుగా నిలిచారు.