Lord Shukra : అనుకున్నంత మాత్రాన అందరూ సక్సెస్ అయిపోలేరు. కొందరి జీవితంలో బాధలు ఉంటాయి కెరీర్ లో సక్సెస్ రాకపోవడం.. వివాహం అవ్వక పోవడం ఎలా ఎన్నో సమస్యలు ఉండొచ్చు మీరు కూడా ఇబ్బందులు పడుతున్నారా..? పెళ్లి అవ్వక ఉద్యోగం రాక సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు రోజు ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా కనుక మీరు చేశారంటే కొన్నాళ్ళకి మీ సమస్యలన్నీ కూడా పోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
మరి ఇక మీ కష్టాల నుండి ఎలా గట్టెక్కాలి..? వివాహం ఆలస్యమైనా ఆర్థిక ఇబ్బందులైనా అప్పులైనా ఇలా ఏ సమస్యకైనా సరే మంత్రం తో పరిష్కారం లభిస్తుంది మరి ఇక దాని గురించి చూసేద్దాం.. నవగ్రహాలలో శుక్రుడి అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా పాటించండి. అప్పుడు కచ్చితంగా సమస్యల నుండి గట్టెక్కేయచ్చు.
స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొంచెం సెంట్, చిటికెడు కుంకుమపువ్వు, కొన్ని తెల్లని పూలు వేసి ఉంచి తర్వాత ఆ నీటి తో స్నానం చేస్తే చాలా అంతా మంచే జరుగుతుంది శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ”హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్” అని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అలానే ఈరోజు తల స్నానమే చెయ్యాలి.
అదే విధంగా ఈ రోజు ఉపవాసం కూడా ఉండాలి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాల తో చేసిన పరవాన్నం చేసి నైవేద్యం పెట్టి తీసుకుంటే మంచిది. వివాహం ఆలస్యమైనా ఆర్థిక ఇబ్బందులైనా అప్పులైనా ఇలా ఈ సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం ఉంటుంది. ఆనందంగా ఉండచ్చు. సమస్యలు ఏమి కూడా వుండవు.