Money Problems : లక్ష్మీ దేవి చంచలమైంది. అంటే ఒకే ఇంట్లో ఉండిపోదు. ఒక ఇంటి నుండి మరొకరి ఇంట్లోకి మారుతూ ఉంటుంది. అందుకే ఒకసారి ధనవంతులుగా మారిన వారు మరోసారి పేదవారిగా మారిపోతుంటారు. అదే సమయంలో పేదవారిగా ఉన్న వారు ధనవంతులుగా ఎదుగుతారు. కొంతమంది ఎన్ని విధాలుగా పూజించిన వారిపై లక్ష్మీ కటాక్షం కలగదు. కొంతమంది పెద్దగా పూజ చేయకపోయిన లక్ష్మీ దేవి వారిపై కరుణను చూపించి వారిని ఐశ్వర్యవంతులు చేస్తుంది. ఎన్ని రకాలుగా ఆలోచించిన వీటికి కారణాలు ఏంటని తెలుసుకోలేకపోతుంటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువై ఎన్ని రకాలుగా లక్ష్మీ దేవిని పూజించిన ఫలితం లేనివారు మనలో చాలా మంది ఉండే ఉంటారు.
ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. కింద చెప్పిన విధంగా లవంగాలతో ఇలా చేస్తే ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి మీతోనే ఉంటుంది. లవంగాలతో పూజ చేయడం ఏంటని మనలో చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. మనం చేసే ప్రతి పనిలో ఎంతో కొంత లాభం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక లేచింది మొదలు తమ పని తాము చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ ధనం నిల్వ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. డబ్బుకు ఎలాంటి లోటు రాకూడదని భావిస్తారు. అలా నిత్యం ఇంట్లో ధనం నిల్వ ఉండాలంటే ఎల్లప్పుడూ ఇంట్లో ధన వర్షం కురవాలంటే పూజలో లవంగం పెట్టి ఇలా చేయాలి. ఇలా చేస్తున్నట్టు ఎవ్వరికి చెప్పకూడదు.
అప్పుడే మనపై లక్ష్మీ దేవి కరుణ చూపిస్తుంది. దీని కోసం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇళ్లంతా శుభ్రం చేయాలి. తరువాత తలస్నానం చేయాలి. ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో లవంగం ఉంచి మూట కట్టాలి. లక్ష్మీ దేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. తరువాత లక్ష్మీ దేవిని మనసులో తలుచుకుని ఇంట్లో కొలువు ఉండమని ధనానికి లోటు లేకుండా చూసుకోమని తమ పేదరికాన్ని తొలగించి మాపై కరుణ చూపించమని ఆమెను కోరుకుంటూ లవంగం మూటను ఆమె ముందు ఉంచాలి. ఆ తరువాత ఆ లవంగం కట్టిన మూటను తీసుకుని డబ్బు దాచుకునే బీరువాలో పెట్టాలి.
ఇలా బీరువాలో లవంగం మూటను పెట్టినట్టు ఇంట్లో వారికి, స్నేహితులకు ఎవ్వరికి చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల వ్యాపారాల్లో మంచి లాభాలు రావడం, చేస్తున్న పనిలో మంచి విజయం సాధించి దాని ద్వారా అధిక ధనప్రాప్తి రావడం జరుగుతుంది. ఇంట్లోకి ధనం ఏదో ఒక విధంగా వస్తుంది. ఇలా ఇంట్లోకి ధనం ప్రవాహంగా రావడంతో మీతో పాటు ఇంట్లోని వారందరూ ఆనందంగా ఉంటారు. ఈ విధంగా లవంగంతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ దేవి కృపకు పాత్రులు కాగలరని పండితులు సూచిస్తున్నారు.