Radhe Shyam : ఫ్లాప్‌ దిశగా రాధే శ్యామ్‌..? ప్రభాస్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసిందా ?

Radhe Shyam : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన చిత్రం రాధే శ్యామ్‌. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థ్రిల్లర్‌ ల‌వ్ స్టోరీ అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. యూవీ క్రియేష‌న్స్‌, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల చేశారు. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి వారం అవుతోంది. కానీ అనుకున్న క‌లెక్ష‌న్‌ల‌ను ఈ సినిమా రాబ‌ట్టలేకపోయింది.

Radhe Shyam heading towards flop talk Prabhas image damaged
Radhe Shyam

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌లో కేవ‌లం రూ.50 కోట్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. నెగిటివ్ రివ్యూస్ వ‌ల్ల మూడో రోజు నుండే ఈ సినిమాకు ప్రేక్షాద‌ర‌ణ త‌గ్గింది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 వంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబ‌లి 2 త‌ర‌వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌లో రూ.25 కోట్ల‌ను రాబ‌ట్టింది. రాధే శ్యామ్ బాలీవుడ్‌లో రూ.20 కోట్ల‌ను కూడా వ‌సూలు చేయలేక పోయింది.

త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా ఇదే తీరుగా సాగింది. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రెండు రోజులు మంచి ఫ‌లితాలు వ‌చ్చినా.. ఆ త‌రువాత నుండి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు తీసుకురాలేక పోయింది. ప్ర‌భాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను రాధే శ్యామ్ దెబ్బ‌తీసింద‌ని సినీ విశ్లేష‌కుల అభిప్రాయం. ఇక ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అనుకున్న వ‌సూళ్లు రాలేదు. ఈ క్రమంలో సినిమా ఫ్లాప్‌ అయిందని అంటున్నారు. మరి రెండో వారం వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Share
D

Recent Posts