Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ముద్దుగుమ్మ.. రష్మిక మందన్న. గతంలోనే ఈమె నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఈమె టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోలతో నటించింది. ఇక పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ కారణంగా ఈమెకు బాలీవుడ్‌లోనూ అనేక ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె పలు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇక రష్మిక మందన్న త్వరలోనే పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొననుంది.
అయితే రష్మిక మందన్న స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లా. అక్కడి కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ఈమె విద్యను అభ్యసించింది. సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని సాధించింది. మోడల్‌గా ఈమె తన కెరీర్‌ను మొదలు పెట్టింది. తరువాత హీరోయిన్ అయింది. 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయం అయింది. తరువాత ఛలో అనే సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది.
ఇక ఈమెకు గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలు మంచి హిట్లను అందించాయి. అయితే రష్మిక మందన్న రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ఒక్క సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక యాడ్‌లో నటిస్తేనే ఈమె రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం ఒక సంవత్సరానికి సుమారుగా రూ.5 కోట్లను ఆర్జిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈమెకు మొత్తం రూ.37 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే ఈమె తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటోంది. అయితే తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తుంది కనుక ముంబై, హైదరాబాద్‌లలోనూ ఇటీవలే ఈమె ఒక్కో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.