Rayalaseema Style Natukodi Vepudu : మనం నాటుకోడిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నాటుకోడిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నాటుకోడిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. నాటుకోడితో కూర, వేపుడు వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాంం. నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, చారు, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. నాటుకోడి వేపుడును మరింత రుచిగా రాయలసీమ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నాటుకోడి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 100 ఎమ్ ఎల్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -తగినంత, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, కారం- 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన నాటుకోడి – అర కిలో, నీళ్లు – 750 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, తోక మిరియాలు – ఒక టీ స్పూన్, నల్ల యాలక్కాయ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, జాజికాయ పొడి – రెండు చిటికెలు, వెల్లుల్లి రెబ్బలు – 8.
నాటుకోడి వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో వెల్లుల్లి రెబ్బలు తప్ప మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు పెద్ద మంటపై కలుపుతూ వేయించాలి.
తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్క ఉడికి నీరంతా పోయే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా 40 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నీరు పోయి చికెన్ దగ్గర పడుతుంది. తరవాత ఇందులో మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర, మరి కొద్దిగా కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. నాటుకోడితో ఇలా చేసిన వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.