Ribbon Pakoda : రిబ్బ‌న్ ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే వీటిని సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..

Ribbon Pakoda : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే పిండి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం శ‌న‌గిపండితో చేసుకోద‌గిన పిండి వంటకాల్లో రిబ్బ‌న్ ప‌కోడీలు ఒక‌టి. ఇవి చూడ‌డానికి రిబ్బ‌న్ల లాగా ఉంటాయి. ఈ రిబ్బ‌న్ ప‌కోడీలు మ‌న‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో ల‌భిస్తూ ఉంటాయి. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ రిబ్బ‌న్ ప‌కోడీల‌ను మ‌నం ఇంట్లో చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా రిబ్బ‌న్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిబ్బ‌న్ ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – పావు కిలో, బియ్యం పిండి – పావు కిలో, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, వాము – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Ribbon Pakoda recipe in telugu very tasty make in this way
Ribbon Pakoda

రిబ్బ‌న్ ప‌కోడి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం పిండి, నువ్వులు, బ‌టర్, వాము, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మురుకుల పిండిలా మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మురుకుల గొట్టాన్ని తీసుకుని అందులో రిబ్బ‌న్ ప‌కోడికి కావ‌ల్సిన బిళ్ల‌ను ఉంచాలి. త‌రువాత గొట్టానికి నూనెను రాసి త‌గినంత పిండిని పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో పిండిని రిబ్బ‌న్ల లాగా పొడ‌వుగా లేదా గుండ్రంగా వ‌త్తుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ రిబ్బ‌న్ ప‌కోడీలు వేడిగా ఉన్న‌ప్పుడు మెత్త‌గా ఉన్నా చ‌ల్లారే కొద్ది క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రిబ్బ‌న్ ప‌కోడీలు త‌యార‌వుతాయి. వీటిని పిల్ల‌లు ఇష్టంగా తింటారు. బ‌య‌ట దొరికే చిరు తిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లో త‌యారు చేసిన రిబ్బ‌న్ ప‌కోడీల‌ను స్నాక్స్ గా తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts