వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పవర్‌లో ఉన్నప్పుడు ఎంత హంగామా చేసిందో మనం చూశాం. ప్రతిపక్షాలని చెడుగుడూ ఆడుతూ వారిపై విమర్శల వర్షం కురిపిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉండేది. అయితే ఓటమి తర్వాత కొంత సైలైంట్ అయింది. అడపాదడపా సోషల్ మీడియాలో మాత్రమే కనిపించి సందడి చేస్తుంది. అయితే రోజా తాజాగా తన పరువును తానే తీసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ మధ్యనే రాష్ట్ర రాజకీయాల్లో తన గొంతు వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుపతి లడ్డూ వివాదంపై సైతం స్పందించిన రోజా.. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంద్రబాబు ఉద్ధేశపూర్వకంగానే వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారని రోజా మండిపడ్డాడు. శ్రీవారి లడ్డూ కల్తీలో వైసీపీ తప్పేం లేదనట్లుగా కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం తిరుమల లడ్డు విషయంలో వివాదం నడుస్తున్న క్రమంలో తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ లో ఓ పోల్ పోస్ట్ చేసారు రోజా. తొలుత తిరుమలలో ఎవరి పాలన బాగుంది? అంటూ పోల్ పెట్టారు. 24 గంటల్లో ఆ పోస్టుకు ఏకంగా 19 వేల మంది ఓట్లు వేస్తే.. 76 శాతం మంది చంద్రబాబు పాలన బాగుందని ఓట్ చేయగా, 24 శాతం మంది జగన్ పాలన బాగుందని ఓట్ చేశారు. ఊహించని విధంగా జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్ల ఓటింగ్ రావడంతో వెంటనే ఆ పోల్ ను డిలీట్ చేశారు.రెండో పోల్ లో తిరుమల లడ్దు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది? అని పోల్ పెట్టారు. ఆప్షన్స్ గా సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పోల్ కు సైతం 24 గంటల్లో 62 వేలకు పైగా నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొన్నారు.
ఇందులో 72 శాతం మంది నెటిజన్లు మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. 21 శాతం మంది చంద్రబాబు అంటూ ఓట్ చేశారు. మరో 7 శాతం మంది పవన్ కల్యాణ్ వల్ల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. రెండో పోల్ లోనూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ షాక్ అయ్యారు. వెంటనే ఈపోల్ ను కూడా రోజా డిలీట్ చేశారు. రెండు పోల్స్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా సెల్వమణి స్పష్టం చేశారు. తన పేరు మీద ఉన్న ఛానెల్స్, అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించాలు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.