Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Rubbu Talimpu : పాతకాలం ప‌ద్ధ‌తిలో చేసే వంట‌కం ఇది.. ఎలా చేయాలంటే..?

D by D
October 5, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Rubbu Talimpu : మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యం కోసం చిన్న తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చిన్న తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ తోట‌కూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ చిన్న తోట‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం వేపుడే కాకుండా దీనితో మ‌నం రుబ్బు తాళింపును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనినే తోటకూర పులుసు అని కూడా అన‌వ‌చ్చు. ఈ కూర‌ను పాత‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ రుబ్బు తాళింపు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చిన్న తోట‌కూర‌తో రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా రుబ్బు తాళింపును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రుబ్బు తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చిన్న తోట‌కూర – 4 క‌ట్ట‌లు ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన టమాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, కారం -ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు -పావు టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌.

Rubbu Talimpu recipe in telugu make in this method
Rubbu Talimpu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

రుబ్బు తాళింపు త‌యారీ విధానం..

ముందుగా తోట‌కూర‌ను శుభ్రంగా క‌డిగి కాడ‌ల‌తో స‌హా చిన్న‌గా త‌ర‌గాలి. త‌రువాత దీనిని క‌ళాయిలోకి తీసుకుని అందులో చింత‌పండు రసం త‌ప్ప మిగిలిన పదార్థాల‌న్నీ వేసి మూత పెట్టి ఉడికించాలి. తోట‌కూర చ‌క్క‌గా ఉడికి నీరంతా పోయిన త‌రువాత పప్పు గుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో చింత‌పండు ర‌సం, త‌గిన‌న్ని నీళ్లు పోసి మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ముందుగా ఉడికించిన కూర‌లో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుబ్బు తాళింపు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చిన్న త‌తోట‌కూర‌తో త‌యారు చేసిన ఈ పులుసును తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Rubbu Talimpu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomatoes Benefits : ట‌మాటాల‌ను అస‌లు ఎవ‌రెవ‌రు తిన‌వ‌చ్చు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.