Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఎల్లప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయమై సల్మాన్ పేరు తెరపైకి వస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి వివాదం లేకుండానే ఆయన పేరు తెరపైకి వచ్చింది. అది కూడా ఆయన పెళ్లి గురించి కావడం విశేషం. సల్మాన్‌కు 50 ఏళ్లు పైబడినా ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆయన పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు ? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తుంటారు. అయితే ఒక ఫ్యాన్ మాత్రం చిలిపి పనిచేశాడు.
సల్మాన్‌ఖాన్ ఇటీవలే నటుడు శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాను పెళ్లి చేసుకున్నాడని.. కావాలంటే చూడండి ఎంగేజ్ మెంట్ రింగ్ కూడా తొడుగుతున్నాడు.. అని చెబుతూ ఓ ఫ్యాన్ ఓ ఫొటోను షేర్ చేయగా.. అది వైరల్ అయింది. అయితే అది మార్ఫింగ్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చడీ చప్పుడు లేకుండా వారు ఇంత సడెన్‌గా పెళ్లి చేసుకోరు. పైగా సల్మాన్ ప్రస్తుతం ఓ ఈవెంట్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. అందువల్ల ఈ ఫొటో ఫేక్ అని స్పష్టమైంది.
అయితే ఈ ఫొటోను చూసిన చాలా మంది ఇది నిజమే కాబోలు అనుకున్నారు. సోనాక్షి సిన్హాను సల్మాన్ ఖాన్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడని ఆనందించారు. సల్మాన్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఈ ఫొటోను ఎడిట్ చేసింది ఎవరో కానీ.. నిజంగా సల్మాన్ పెళ్లి చేసుకున్నట్లు చాలా చక్కగా మార్ఫింగ్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.