Samantha Naga Chaitanya : సమంత, నాగచైతన్య తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతూ గతేడాది అక్టోబర్ 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే వీరు విడాకులు తీసుకోవడం ఎంతో మందికి నచ్చలేదు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య విడిపోవడం ఎవరికీ నచ్చలేదు. అయితే వీరిద్దరికీ చెందిన పాత విషయాలను కొందరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరొక పోస్టు వైరల్ అవుతోంది.

గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా సమంత నటుడు అలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సమంత, చైతన్య ఇద్దరూ ఏం మాయ చేశావె సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన విషయం విదితమే. అయితే ఆ సమయంలో తనకు నాగచైతన్య ఎంతగానో సహాయం చేశాడని సమంత అప్పట్లో అలీ ప్రోగ్రామ్‌లో చెప్పింది. అలాగే ఇద్దరిలో ఎవరు ముందు ఎవరితో లవ్‌లో పడ్డారు.. అని అడగ్గా.. అందుకు సమంత బదులిస్తూ.. తానే చైతన్యతో ముందుగా లవ్‌లో పడ్డానని తెలిపింది. అయితే అంతటి అన్యోన్యంగా ఉండే జంట విడిపోవడం ఇప్పటికీ ఎవరికీ మింగుడు పడడం లేదు.
ఇక ఈ మధ్యే సమంత పుష్ప సినిమాలో ఊ అంటావా.. పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఈమె పలు వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం అనే సినిమాలో సమంత శకుంతలగా నటించగా.. ఈ మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ను ఇటీవలే రివీల్ చేశారు. ఆ లుక్ వైరల్‌గా మారింది. అలాగే నయనతార, సమంత, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.