Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ తమ తమ సోషల్ ఖాతాల్లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు. తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నామని.. తమకు ఈ సమయంలో ప్రైవసీ కల్పించాలని.. ఇబ్బందులకు గురి చేయవద్దని.. తాము దంపతులుగా విడిపోయినా.. స్నేహితులుగా కలిసే ఉంటామని చెప్పారు. అయితే ఆ తరువాత కనీసం ఒకరికొకరు బర్త్ డే విషెస్ కూడా చెప్పుకోలేదు. దీంతో వీరి మధ్య గొడవ పెద్దగానే అయి ఉంటుందని.. అందుకనే కనీసం విషెస్ కూడా చెప్పుకోవడం లేదని.. భావించారు. అయితే అసలు వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

సమంత గతంలో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం విదితమే. అలాగే ఒకటి రెండు సినిమాల్లోనూ బోల్డ్ సీన్లలో నటించింది. ఈ క్రమంలోనే ఈ విషయం అక్కినేని కుటుంబానికి నచ్చలేదని.. వారు ఆమెకు నచ్చజెప్పారని.. అయినప్పటికీ సమంత వినలేదని.. అందుకనే ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని.. ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరి విడాకులకు కారణాలు ఏమున్నప్పటికీ తాజాగా సమంత మాత్రం నాగచైతన్యకు షాకిచ్చింది.
నాగచైతన్యను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. కానీ చైతన్య మాత్రం ఆమెను ఇంకా ఫాలో చేస్తూనే ఉన్నాడు. ఇక సమంత తమ ఇద్దరికీ చెందిన ఫొటోలను డిలీట్ చేసింది. కానీ చైతన్య అలా చేయలేదు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సమంతపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక సమంత తాజాగా చేసిన పనికి వారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య కన్నా సమంతనే ప్రస్తుతం ఎక్కువ బిజీగా ఉందని చెప్పవచ్చు. వరుణ్ ధావన్‌తో కలిసి ఈమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో నటిస్తుండగా.. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ చిత్రంలోనూ ఈమె నటిస్తోంది. ఈమె నటించిన తమిళ మూవీ కాతు వాకుల రెండు కాదల్ ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.