Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

D by D
September 10, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Seema Vankaya Masala Curry : మ‌నం సీమ వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటినే బెంగుళూరు వంకాయ‌లు అని కూడా అంటారు. సీమ‌వంకాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు కూడా. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సీమ వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సీమ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. సీమ వంకాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు. సీమ‌వంకాయ‌ల‌తో అంద‌రికి న‌చ్చేలా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

తొక్క తీసి త‌రిగిన సీమ వంకాయ‌లు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Seema Vankaya Masala Curry recipe in telugu make in this method
Seema Vankaya Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ల‌వంగాలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ట‌మాటాలు – 3.

సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన దినుసులు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత సీమ‌వంకాయ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి.

ఇందులోనే ప‌సుపు కూడా వేసిక‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టాలి. త‌రువాత దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారవుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Seema Vankaya Masala Curry
Previous Post

White Mustard Seeds : తెల్ల ఆవాల గురించి తెలుసా.. వీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Next Post

Poha Vada : వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపిస్తే.. ఇవి చేయండి.. 10 నిమిషాల్లో పూర్త‌వుతాయి..!

Related Posts

వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025
information

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

June 7, 2025
ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

June 7, 2025
హెల్త్ టిప్స్

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

June 7, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!