Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Semiya Pulao : సేమియాతో పులావ్‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

D by D
January 30, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Semiya Pulao : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ సేమియాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో సేమియా పులావ్ కూడా ఒక‌టి. సేమియా పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌సాలా దినుసులు వేసి చేసే ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సేమియా పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సేమియా – ఒక క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 4, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, త‌రిగిన క్యాప్సికం – 1, త‌రిగిన క్యారెట్ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నీళ్లు – రెండు క‌ప్పులు, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌, త‌రిగిన పుదీనా – అర క‌ట్ట‌, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Semiya Pulao recipe in telugu make in this method
Semiya Pulao

సేమియా పులావ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక సేమియా వేసి చిన్న మంట‌పై మాడిపోకుండా వేయించాలి. త‌రువాత సేమియాను ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ల‌వంగ‌లు, దాల్చిన చెక్క‌, యాల‌కులు, సాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి స‌గానికి పైగా వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌టి రంగు వ‌చ్చిన త‌రువాత బ‌ఠానీ, క్యారెట్, క్యాప్సికం ముక్క‌లు వేసి 70 శాతం వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి నీళ్ల‌ను చ‌క్క‌గా మ‌రిగించాలి. నీళ్లు బాగా మరిగిన త‌రువాత వేయించిన సేమియా, ట‌మాట ముక్క‌లు, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పులావ్ త‌యార‌వుతుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా సేమియాతో ఇలా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ సేమియా పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Semiya Pulao
Previous Post

Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..

Next Post

Mint Leaves : విట‌మిన్ ఎ కు పుట్టినిల్లు ఇది.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. రోజూ 5 ఆకులు చాలు..

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!